జైట్లీ కన్నా నేనే మిన్న: స్వామి | I Am better than Jaitley sayes swamy | Sakshi
Sakshi News home page

జైట్లీ కన్నా నేనే మిన్న: స్వామి

Sep 18 2016 2:17 AM | Updated on Sep 4 2017 1:53 PM

జైట్లీ కన్నా నేనే మిన్న: స్వామి

జైట్లీ కన్నా నేనే మిన్న: స్వామి

ఆర్థిక మంత్రిగా ప్రస్తుత అరుణ్ జైట్లీ కన్నా తానైతే మరింత బాగా పనిచేసి ఉండేవాడినని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు.

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిగా ప్రస్తుత అరుణ్ జైట్లీ కన్నా తానైతే మరింత బాగా పనిచేసి ఉండేవాడినని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. జైట్లీ, స్వామిల మధ్య వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండియా టుడే శనివారం నిర్వహించిన మైండ్ రాక్స్ సదస్సులో స్వామి పాల్గొన్నారు. ఇదే సదస్సులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా సుబ్రమణ్య స్వామి ఉంటే ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా కట్టడి చేసేవారని అన్నారు.

అనంతరం స్వామి మాట్లాడుతూ ‘ఆయన న్యాయవాది. నేను ఆర్థిక వేత్తను. నాకన్నా బాగా ఆయనెలా పనిచేయగలరు?’ అని ప్రశ్నించారు. హోం మంత్రిగా రాజనాథ్ సింగ్ కన్నా మీరు బాగా చేసేవారా అని అడగగా ‘రాజ్‌నాథ్ నా స్నేహితుడు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ తర్వాత ఆయనే అత్యుత్తమ హోం మంత్రి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement