భార్య చూయింగ్‌ గమ్‌ తినలేదని...

Husband Gave Tripple Talaq To Wife For Not Accepting Chewing Gum - Sakshi

లక్నో:  ​కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ పై చట్టం చేసినా ఇంకా అనుకున్న మార్పు రాలేదు. ఇందుకు ఉదాహరణగా లక్నోలోని రశీద్‌ అనే వ్యక్తి తన భార్య సిమ్మికి చూయింగ్‌ గమ్‌ ఇవ్వగా ఆమె తిరస్కరించడంతో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన ఘటన తాజాగా వెలుగుచూసింది.  దీనిపై సిమ్మి స్పందిస్తూ తాను 2004లో సయ్యద్‌ రశీద్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని చెప్పారు. అయితే వివాహమైనా కొద్ది రోజుల్లోనే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కోసం తీవ్రంగా వేధించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసు విచారణలో భాగంగా సివిల్‌ కోర్టులో వాదనలు వినిపించడానికి రాగా, భర్త తనకు చూయింగ్‌ గమ్‌ ఇచ్చాడని దీనిని తాను తిరస్కరించగా ఈ కారణంతో మూడుసార్లు తలాక్‌ చెప్పి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి వాజిర్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం పై ఎస్‌పీ వికాస్‌ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ వారి కుటుంబ కలహాల అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top