తుపాకీతో కాల్చుకున్న మాజీ సీఎం మనవడు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడు చనిపోయాడు. తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చండీగఢ్‌లోని తమ నివాసంలో హర్కిరాత్ సింగ్ ఆదివారం ఉదయం తనను తాను కాల్చుకున్నాడు.
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడు చనిపోయాడు. తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చండీగఢ్‌లోని తమ నివాసంలో హర్కిరాత్ సింగ్ ఆదివారం ఉదయం తనను తాను కాల్చుకున్నాడు.
దీంతో అతడిని స్థానికంగా ఉన్న పీజీమర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు గానీ, ప్రాథమిక సమాచారం మేరకు అతడు ఏదో అంశం విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైన కారణంగానే చనిపోయి ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం.


