'అమ్మ' ఆరోగ్యంపై సమాచారం ఇవ్వండి! | give Jayalalithaa health details clearly, says madras high court | Sakshi
Sakshi News home page

'అమ్మ' ఆరోగ్యంపై సమాచారం ఇవ్వండి!

Oct 4 2016 10:26 PM | Updated on Oct 8 2018 3:56 PM

'అమ్మ' ఆరోగ్యంపై సమాచారం ఇవ్వండి! - Sakshi

'అమ్మ' ఆరోగ్యంపై సమాచారం ఇవ్వండి!

తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది.

సీఎం జయలలిత ఆరోగ్యంపై హైకోర్టు
చెన్నై: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు చెక్ పెట్టే విధంగా సమాచారం బహిర్గతం చేయాలని సూచించింది. తమిళనాడు సీఎం జయలలితకు చెన్నై అపోలో ఆస్పత్రిలో 13వ రోజులుగా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు ప్రకటించారు.

అదే సమయంలో మద్రాసు హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎఎం. సుందరేషన్, మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. వదంతులకు చెక్ పెట్టే విధంగా సీఎం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం లోపు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ప్రకటించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement