డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు.. | Four constables suspended for dereliction of duty | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

Feb 2 2016 5:13 PM | Updated on Sep 3 2017 4:49 PM

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

డిప్యూటీ సీఎం సభకు లేటుగా వచ్చినందుకు..

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు పోలీసు కానిస్టేబుళ్లపై వేటు పడింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు పోలీసు కానిస్టేబుళ్లపై వేటు పడింది. తూర్పు ఢిల్లీలోని పాట్పర్ గంజ్ ప్రాంతంలో ఆదివారం సిసోడియా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాండవనగర్ పోలీసు స్టేషన్‌ కు చెందిన పోలీసులను ఈ కార్యక్రమ బందోబస్తు కోసం నియమించారు. అయితే ఓ మహిళ సహా నలుగురు కానిస్టేబుళ్లు సకాలంలో ఈ కార్యక్రమం వద్దకు  చేరుకోలేదు. బందోబస్తు విధుల నిర్వహణలో వారు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఏసీపీ విచారణ నిర్వహించారు. ఆలస్యంగా వచ్చినట్టు తేలడంతో నలుగురిపై వేటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement