తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్య ధర్నాకు వెళుతున్న సమైక్యవాదుల ప్రత్యేక రైలును పోలీసులు వోక్లా స్టేషన్లో నిలిపివేశారు.
న్యూఢిల్లీ : తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్య ధర్నాకు వెళుతున్న సమైక్యవాదుల ప్రత్యేక రైలును పోలీసులు వోక్లా స్టేషన్లో నిలిపివేశారు. రైలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోవటంతో.... సమైక్యవాదులు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అక్కడ నుంచి జంతర్ మంతర్ వద్దకు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. అయితే ఆ ప్రత్యేక బస్సులను కూడా నిలిపివేయటంతో ....పోలీసులతో వైఎస్ఆర్ సీపీ నేతలు వాగ్వివాదానికి దిగారు.