ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది! | Crocodile enters UP village, captured by forest officials | Sakshi
Sakshi News home page

ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది!

Apr 22 2016 5:46 PM | Updated on Sep 3 2017 10:31 PM

ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది!

ఊరిలోకి వచ్చి.. చుక్కలు చూపెట్టింది!

ఎండలు పెట్రేగుతున్నాయి. ఎన్నడులేని రీతిలో దంచి కొడుతున్నాయి.

ఎండలు పెట్రేగుతున్నాయి. ఎన్నడులేని రీతిలో దంచి కొడుతున్నాయి. అడవి ఎండిపోతున్నది. కుంటలు, చెరువులు, గుంతుల్లో నీరు ఆవిరవుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నీటి జాడను వెతుక్కుంటూ ఓ మొసలి ఊరిలోకి జనాలను హడలెత్తించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌ జిల్లాలోని రసాని గ్రామంలో జరిగింది.

గ్రామంలోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన మొసలి గురించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఒడుపుగా మొసలిని బంధించారు. ఈ ఉభయచరాన్ని జాతీయ చంబల్‌ జంతు సంక్షరణ కేంద్రంలోని చంబా నదిలో వదిలివేయనున్నట్టు వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement