
ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి: సీఎం
ఒకవైపు ఈవీఎంల గురించి దేశంలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాత్రం సొంత పార్టీకే ఝలక్ ఇస్తూ ఈవీఎంలను వెనకేసుకు వస్తున్నారు.
ఒకవైపు ఈవీఎంల గురించి దేశంలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాత్రం సొంత పార్టీకే ఝలక్ ఇస్తూ ఈవీఎంలను వెనకేసుకు వస్తున్నారు. ఈవీఎంలను రిగ్గింగ్ చేస్తున్నారని, వాటివల్లే ఎన్నికల ఫలితాలు మారిపోతున్నాయని స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చెబుతుండగా.. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతో ఉన్న సిద్దు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాత్రం ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగిన రెండు నియోజకవర్గాల్లోను ఈవీఎంలు బాగా పనిచేశాయని, ఎక్కడా ట్యాంపరింగ్ జరగలేదని సిద్దరామయ్య అన్నారు.
ఈవీఎంలు సరిగా పనిచేయకుండా వాటిని రిగ్గింగ్ చేసి ఉంటే తాను ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కానని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయింది తమ పార్టీయేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ఢిల్లీలో చెబుతుంటే, ఇక్కడ రాష్ట్రాల్లో వీరిద్దరు మాత్రం వాటిని వెనకేసుకు రావడం గమనార్హం.