వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ? | Cabinet expansion at next week | Sakshi
Sakshi News home page

వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ?

Nov 26 2014 10:53 PM | Updated on Sep 2 2017 5:10 PM

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలోని మంత్రివర్గ విస్తరణ...

 సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలోని మంత్రివర్గ విస్తరణ ఈ నెల 29 లేదా 30న జరిగే అవకాశాలున్నాయి. ఇందులో ఆరుగురు కేబినెట్, 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా ఈ విస్తరణంలో మిత్ర పక్షాలకు కూడా స్థానం కల్పించనున్నారు. కాగా ఇండిపెండెంట్లకు అవకాశం ఇచ్చే సూచనలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రులుగా గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, చైన్‌సుఖ్ సంచేతీ లేదా గోవర్ధన్ శర్మ, మహాదేవ్ జాన్కార్ (రాష్ట్రీయ సమాజ్ పార్టీ), మంగళ్‌ప్రభాత్ లోఢా, సునీల్ దేశ్‌ముఖ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.

 సహాయ మంత్రులుగా రామ్ షిండే, జయ్‌కుమార్ రావల్, సంభాజీ పాటిల్ నిలంగేకర్, సుభాశ్ దేశ్‌ముఖ్, సురేశ్ ఖాడే లేదా శివాజీరాశ్ నాయిక్, సీమా హిరే లేదా దేవయాని ఫరాందే, చంద్రశేఖర్ బావన్‌కులే, కృష్ణ ఖోపడే, బాలా బేగ్డే, బబన్ లోణికర్, మదన్ యేరవార్, సదాభావు ఖోత్ (స్వాభిమాని శేత్కరి), వినాయక్ మేటే (శివ్ సంగ్రాం) ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement