పుట్టినవాడు గిట్టక మానడు! | Another accused in Vyapam scam dies, number up to 24 | Sakshi
Sakshi News home page

పుట్టినవాడు గిట్టక మానడు!

Jun 30 2015 4:15 AM | Updated on Oct 8 2018 3:28 PM

పుట్టినవాడు గిట్టక మానడు! - Sakshi

పుట్టినవాడు గిట్టక మానడు!

‘పుట్టినవాడు గిట్టక మానడు..మరణం అనేది సహజం.. అది జైల్లో అయినా.. రైల్లో అయినా.. ఒకసారి పుడితే చనిపోక తప్పదు’..

‘వ్యాపమ్’ నిందితుల మరణాలపై మధ్యప్రదేశ్ హోం మంత్రి
భోపాల్: ‘పుట్టినవాడు గిట్టక మానడు..మరణం అనేది సహజం.. అది జైల్లో అయినా.. రైల్లో అయినా.. ఒకసారి పుడితే చనిపోక తప్పదు’.. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ అన్న మాటలివి. సంచలనం సృష్టించిన ఆ రాష్ట్ర వృత్తి పరీక్షల బోర్డు(ఎంపీపీఈబీ) అలియాస్ వ్యాపమ్ స్కాం నిందితులు ఒకరి తరువాత ఒకరు చనిపోవటంపై మంత్రి చేసిన వ్యాఖ్యలివి. ఈ స్కాంలో ఇద్దరు నిందితులు 24 గంటల వ్యవధిలో చనిపోవటంపై సీబీఐ విచారణ జరిపించటానికి సోమవారం ఆయన తిరస్కరించారు.

తమ విచారణ సరైన దిశలోనే సాగుతోందన్నారు. వ్యాపమ్ కేసులకు సంబంధించి దాదాపు వందమంది నిందితులలో 25మంది చనిపోయారు.       
 
‘మద్యపానం ప్రాథమిక హక్కు..’: మద్యపానం ప్రాథమిక హక్కు, సామాజిక హోదాకు చిహ్నమని బాబూలాల్ గౌర్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యంతో నేరాలు పెరగవన్నారు. భోపాల్‌లో మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రి 11.30కు పొడిగించడంపై ఆయనిలా స్పందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement