రూ. 899కు విమాన టికెట్ | AirAsia offers domestic flights at Rs 899, international at Rs 3,399 | Sakshi
Sakshi News home page

రూ. 899కు విమాన టికెట్

Jun 13 2016 7:10 PM | Updated on Sep 4 2017 2:23 AM

రూ. 899కు విమాన టికెట్

రూ. 899కు విమాన టికెట్

ఎయిర్ ఏషియా విమాన సంస్థ మరోసారి ఆఫర్ ప్రకటించింది.

ఎయిర్ ఏషియా విమాన సంస్థ మరోసారి ఆఫర్ ప్రకటించింది. మలేసియాకు చెందిన ఈ విమానయాన సంస్థ భారత్లో సర్వీసులు ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టికెట్లపై డిస్కౌంట్ ఇచ్చింది. దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్ ధరలకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎయిర్ ఏషియా అధికార వెబ్సైట్లో సోమవారం డిస్కౌంట్ టికెట్ ధరల వివరాలను ప్రకటించింది.

బెంగళూరు, జైపూర్, కోచి, న్యూఢిల్లీ, పుణె వంటి నగరాల మధ్య నడిచే విమాన సర్వీసుల కనిష్ట టికెట్ ధర పన్నులతో సహా 899 రూపాయలు. ఇక బాలి, బ్యాంకాక్, కౌలాలంపూర్, మెల్బోర్న్, పెర్త్, సింగపూర్లకు వెళ్లే విదేశీ సర్వీసుల్లో కనిష్ట టికెట్ ధరను 3399 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 19 వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా టికెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో ప్రయాణించాలి. మరిన్ని వివరాల కోసం www.airasia.com వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement