కరోనా: 92 విమానాలను రద్దుచేసిన ఎయిరిండియా

Air India cancels 92 flights between May 28 and May 31 - Sakshi

  వివిధ మార్గాల్లో 92 విమానాలు రద్దు

మే 31 వరకు నడిచే విమానాలు  క్యాన్సిల్

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  వివిధ మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు  ప్రకటించింది.   కరోనా వైరస్ కారణంగా పరిమిత కార్యకలాపాలు, కఠిన క్వారంటైన్ నిబంధనల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మే  28 - 31తేదీల మధ్య నడవాల్సిన 92 విమానాలను రద్దు చేసింది. దీంతోపాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు.

ఢిల్లీ-కోల్‌కతా, చెన్నై-ఢిల్లీ, హైదరాబాద్-బెంగళూరు, కోల్‌కతా-గౌహతి, చెన్నై-బెంగళూరు,ఢిల్లీ-హైదరాబాద్, చెన్నై-ముంబై, ముంబై-భోపాల్, కోల్‌కతా-దిబ్రుగర్, కోల్‌కతా-అజ్వాల్, కోల్‌కతా- అగర్తలా,  ముంబై-ఢిల్లీ, ముంబై-అహ్మదాబాద్ తదితర మార్గాల మధ్య నడిచే  విమానాలు  రద్దు చేసిన వాటిల్లో ఉన్నాయి.  (గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : జూలై 6 నుంచి ఆఫీసు)

రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేసినవారు 2020 ఆగస్టు 24 వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉన్న విమానాలలో బుక్ చేసుకోవడానికి అనుమతి వుంటుందని  ఎయిరిండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది.  అలాగే రూటు  మార్పునకు  కూడా అనుమతి వుంటుందని , ఛార్జీలలో వ్యత్యాసం తప్ప, దీనికి సంబంధించిన చార్జీలను రద్దు చేసినట్టు తెలిపింది.   (42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top