మూడు రోజుల ఆఫీసు!

After lockdown: Three-Day week in the office! - Sakshi

భయమేస్తోందా? అలాంటి పరిస్థితి రాకూడదు..

జనాభా పెరిగిపోతోంది కాబట్టి వాతావరణ మార్పుల ప్రభావం విస్పష్టంగా తెలుస్తోంది కాబట్టి... కరోనా లాంటి ఉత్పాతాలు సమీప భవిష్యత్తులో మరిన్ని వస్తాయన్నది మాత్రం నిస్సందేహం. అందుకే భౌతిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌ లాంటివి కరోనా అనంతర ప్రపంచంలో కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఇది కాస్తా చట్టమైందనుకోండి. చిత్ర విచిత్రమైన పరిణామాలు ఎదురవుతాయి. మనుషులకు దూరంగా ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితమవడం వల్ల మానసికంగా కుంగిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో గుండె జబ్బులు, మతిమరుపు, చావుల్లాంటివీ వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిబంధనల అమలుకు కొన్ని ఫైన్లు గట్రా గ్యారంటీ. (వూహాన్లో ఏం జరిగింది?)

ఈ చట్టాలు, ఫైన్లు ఉన్నాయి కాబట్టి కంపెనీలు తమ వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు వినూత్న పద్ధతులను పాటించాల్సి వస్తుంది. హోటళ్లలో కూర్చొని తినడం ఉండదు కాబట్టి ఆహారం ఇంటికే తెచ్చి ఇచ్చే సంస్థలకు డిమాండ్‌ పెరిగిపోతుంది. జిమ్‌లు పనిచేసే అవకాశాల్లేవు కాబట్టి ప్రజలు వ్యాయామం కోసం సైక్లింగ్, ట్రెక్కింగ్, హైకింగ్, సర్ఫింగ్‌ వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తుంది. కాకపోతే ఎప్పుడు? ఎక్కడ ఎంత సమయం అన్నది ముందుగానే నిర్ణయమైపోతుంది. ఉదాహరణకు కేబీఆర్‌ పార్కులో ఉదయం గంటలవారీ స్లాట్లు ఏర్పాటవుతాయి. నిర్దిష్ట సంఖ్యలోనే ప్రజలను వాకింగ్‌కు అనుమతిస్తారు. (కరోనా కొనసాగితే కష్టమే..)

కాలక్రమంలో ప్రజల కదలికలపై నిఘా పెట్టేందుకు కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. ఫేస్‌ రికగ్నిషన్‌ వంటివన్నమాట. మూడు అడుగుల కంటే దగ్గరకు ఎవరైనా వస్తే సెల్‌ఫోన్లే పెద్ద సౌండ్‌తో అలారమ్‌ మోగించినా మోగించగలవు. అంతేకాదు ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లే తీరు కూడా మారిపోతుంది. ఒకరోజు ఆఫీసు ఇంకో రోజు ఇంట్లోంచి పనిచేయడం లేదా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాటించిన సరి–బేసి విధానం మాదిరిగా వారంలో కొన్ని రోజులు ఐటీ.. ఇంకొన్ని రోజులు ఇతర కంపెనీల వాళ్లు ఇలా అన్నమాట. ఇదిలాగే కొనసాగితే ఏమవుతుందో తెలుసా? ఇంకో మనిషి మన దగ్గరగా వస్తున్నాడంటే ఏదో జరిగిపోతోంది అన్న భయం.. అగరోఫోబియా వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. (వుహాన్ వైరాలజీ సంస్థలో 1500 వైరస్లు..!)

భయమేస్తోందా? అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం. కానీ వాటి నుంచి తప్పించుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదులెండి. ఎంచక్కా అన్ని రకాల డిజిటల్‌ సాధనాలను వాడుకుంటూ అందరితో ‘టచ్‌’లో ఉంటే చాలు! టచ్‌ అంటే తాకడం కాదండోయ్‌! ఆడియో, వీడియోల ద్వారా అందరితో సంబంధాలు మెయింటెయిన్‌ చేయడమన్నమాట. కొంతకాలానికి ఈ పద్ధతులకు అలవాటుపడ్డా కొన్ని సందర్భాల్లో ఇంకొకరి తోడు కచ్చితంగా అవసరం అనిపిస్తుంది. దీన్ని టెక్నాలజీ మార్చేయలేదు. ముఖ కవళికలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనే కంప్యూటర్లు/రోబోలు ఇప్పటివరకూ రాలేదు మరి! (కరోనా మళ్లీ మళ్లీ రావచ్చు: డబ్ల్యూహెచ్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top