హీరో సిద్ధార్థ్‌పై కేసు | 600 people booked for anti CAA protest in Chennai including actor Siddharth | Sakshi
Sakshi News home page

మిన్నంటుతున్న నిరసనలు, హీరో సిద్ధార్థ్‌పై కేసు

Dec 20 2019 2:07 PM | Updated on Dec 20 2019 2:24 PM

600 people booked for anti CAA protest in Chennai including actor Siddharth - Sakshi

సాక్షి,  చెన్నై:  దేశవ్యాప్తంగా  పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి.  దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై  చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ ఇందులో ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది.

రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికి, ఆందోళన చేపట్టినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో  పౌరతసత్వ  సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. భీం ఆర్మీ ఆధ్వర్యంలో జామా మసీద్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. (నిరసన జ్వాలలు: మీకు సెల్యూట్‌ సార్‌.. !)


 ఢిల్లీలో శుక్రవారం నాటి ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement