
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పాటను ఆస్ట్రియాలోని తిరోల్ అనే ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్ చేసిన చిత్ర నిర్మాతలు వైభవీ మర్చంట్ నృత్య దర్శకత్వంలో పాట తెరకెక్కుతోంది. షూటింగ్ లోకేషన్‌కు చేరకునేందు కేబుల్ కార్స్‌లో ప్రయాణిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.
ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ముందు శంకర్ ఇషాన్ లాయ్‌లను తీసుకున్నారు. అయితే ఇటీవల ఈ సంగీత త్రయం సాహో నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. శంకర్ ఇషాన్ లాయ్‌లు తప్పుకున్న విషయాన్ని దృవీకరించిన సాహో టీం సంగీత బాధ్యతలు ఎవరికి అప్పగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. నేపథ్య సంగీతం మాత్రం గిబ్రాన్ అందిస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న పాటకు సంగీతం ఎవరు సమకూర్చినట్టుగా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అధికారికంగా సంగీత దర్శకుడిని ఎందుకు ప్రకటించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిసస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖ నటులు నటింస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
The film with the lead actors #Prabhas & @ShraddhaKapoor will be released on the 15th of August. Thank you to the team of #gaislachkogelbahn #topoftyrol #myinnsbruck #cineTirol for their tremendous support & experience.#FISA #locationaustria (2/2)
— UV Creations (@UV_Creations) 25 June 2019