‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ బ్యాక్’ | 'welcome' Sequel 'welcome back' | Sakshi
Sakshi News home page

‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ బ్యాక్’

Aug 17 2013 1:02 AM | Updated on Apr 3 2019 6:23 PM

‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ బ్యాక్’ - Sakshi

‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ బ్యాక్’

అదృష్టం దరిదాపుల్లోకి రానంతవరకూ ఎంత కష్టపడ్డా వృథా అవుతుంది. అదే కనుక అదృష్టం చల్లని చూపు చూస్తే.. ఇక చెప్పడానికేముంటుంది? జీవితం ఫుల్ జోష్‌గా ఉంటుంది.

అదృష్టం దరిదాపుల్లోకి రానంతవరకూ ఎంత కష్టపడ్డా వృథా అవుతుంది. అదే కనుక అదృష్టం చల్లని చూపు చూస్తే.. ఇక చెప్పడానికేముంటుంది? జీవితం ఫుల్ జోష్‌గా ఉంటుంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ ఇలాంటి జోష్‌లోనే ఉన్నారు. కెరీర్ ప్రారంభంలోనే అపజయాలను చవి చూసిన శ్రుతి ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటున్నారు.
 
దక్షిణాదిన మాత్రమే కాదు, ఉత్తరాదిన కూడా ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు. ఆమె నటించిన హిందీ చిత్రాలు డి-డే, రామయ్యా వస్తావయ్యా ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్‌లో శ్రుతికి అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే హిందీలో ఈ బ్యూటీ ‘గబ్బర్’ అనే చిత్రం అంగీకరించారు. తాజాగా శ్రుతి ఖాతాలో మరో సినిమా చేరిందని సమాచారం. 
 
 ‘వెల్‌కమ్’కి సీక్వెల్‌గా ‘వెల్‌కమ్ బ్యాక్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ముందుగా అసిన్‌ని నాయికగా తీసుకున్నారట. ఆ తర్వాత సోనాక్షిసిన్హాని ఎంపిక చేశారని సమాచారం. అయితే సోనాక్షి డేట్స్ కుదరకపోవడంతో వేరే నాయికను ఎంపిక చేయాలనుకున్నారట. 
 
 అదే సమయంలో ఈ చిత్రదర్శకుడు అనీష్ బజ్మీ డీ-డే, రామయ్యా వస్తావయ్యా చిత్రాలను చూడటం, శ్రుతి నటనకు ఇంప్రెస్ అవ్వడం జరిగిందని బాలీవుడ్ టాక్. ఆ సినిమాలు చూసిన తర్వాత శ్రుతిని తప్ప ఎవర్నీ తీసుకోకూడదని ఆయన బలంగా నిర్ణయించుకున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement