'కథ నా చుట్టే తిరగాలి' | Shruti Haasan wants to do solo lead roles in Bollywood | Sakshi
Sakshi News home page

'కథ నా చుట్టే తిరగాలి'

Jun 12 2015 11:10 AM | Updated on Jul 6 2019 12:38 PM

'కథ నా చుట్టే తిరగాలి' - Sakshi

'కథ నా చుట్టే తిరగాలి'

ఇక నుంచి ఒక చిత్ర భారాన్నంత తన భుజస్కందాలపై మోయాలనుకుంటున్నట్లు, ఆ చిత్రంలోని కథాకథనం తన పాత్ర చుట్టే తిరగాలని భావిస్తున్నట్లు ప్రముఖ నటి శృతిహాసన్( 27) అంటోంది.

ముంబయి: ఇక నుంచి ఒక చిత్ర భారాన్నంత తన భుజస్కందాలపై మోయాలనుకుంటున్నట్లు, ఆ చిత్రంలోని కథాకథనం తన పాత్ర చుట్టే తిరగాలని భావిస్తున్నట్లు ప్రముఖ నటి శృతిహాసన్( 27) అంటోంది. బాలీవుడ్ చిత్రాల్లో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించిన ఆమె ఇక నుంచి మాత్రం ఒకే హీరోయిన్ పాత్ర ఉన్న చిత్రాల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

తన ముందుకు మల్టీ స్టారర్ చిత్రాలు, ఒకే హీరోయిన్ నటించే చిత్రాలు వచ్చినప్పుడు అందులో దేనిని ఎంచుకోవాలనే విషయంలో తాను చాలా ఇబ్బందిపడుతున్నట్లు తెలిపింది. అందుకే ఇక నేరుక ఒకే హీరోయిన్ ఉండే చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు వివరించింది.  పాటలు పాడటం అనేది వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా అమితంగా ఇష్టపడతానని పేర్కొంది. తనకు బాలీవుడ్ కంటే దక్షిణాధి చిత్రాలే ఎక్కువగా ఇష్టమని, వారు తన బాలీవుడ్ చిత్రాలు చూస్తుంటే తనకు చాలా సంతోషం వేస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement