ఎప్పుడూ ఆ విషయాన్నే అడుగుతారు:శృతిహాసన్ | People always ask how's my dadm, says Shruti hasan | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ ఆ విషయాన్నే అడుగుతారు:శృతిహాసన్

Jan 11 2015 11:34 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఎప్పుడూ ఆ విషయాన్నే అడుగుతారు:శృతిహాసన్ - Sakshi

ఎప్పుడూ ఆ విషయాన్నే అడుగుతారు:శృతిహాసన్

శృతిహాసన్.. సినిమా ఇండస్టీకి పరిచయమై ఆరేళ్లు కావొస్తున్నాతనకు తండ్రి కమల్ హాసన్ విషయమే ఎక్కువగా తారసపడుతూ ఉంటుందని తాజాగా స్పష్టం చేసింది.

ముంబై: శృతిహాసన్.. సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఆరేళ్లు కావొస్తున్నాతండ్రి కమల్ హాసన్ విషయమే తనకు ఎక్కువగా తారసపడుతూ ఉంటుందని తాజాగా స్పష్టం చేసింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలతో పాటు బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ .. తన తండ్రి కమల్ హాసన్ గురించే ప్రజలు అడిగే ప్రశ్నలకు కొన్ని సార్లు ఏమి చెప్పాలో తెలియదని తెలిపింది.  ఇందుకోసం కొన్నిసందర్భాల్లో తగిన సమాధానం ఇవ్వలేనని ఆమె పేర్కొంది.

' ఎవరో ఒకరు నన్ను కలిసిన ప్రతీసారి డాడీ ఏమి చేస్తున్నారు. ఎలా ఉన్నారు. మీ గురించి ఆయన ఎలా ఫీలవుతున్నారు' అని మాత్రమే అడుగుతారని తెలిపింది. తన నాన్న కమల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్న ఈ కోలీవుడ్ భామ..  వారే ప్రశ్నలకు సమాధానం మాత్రం తెలియదనే ఎక్కువగా  వస్తుంటుందని పేర్కొంది. ఆ సమయంలో నాకు ఏమి చెప్పాలో తెలియకే అలా జరుగుతుందని శృతి పేర్కొంది. ' మా నాన్న గురించి ఏమి చెప్పను.  ఆయనకు కష్టించే గుణం ఎక్కువ. ఆయనకు కూతురిగా పుట్టడమే అదృష్టం' అని శృతి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement