‘మనుశర్మకు ఈ శిక్ష సరిపోదు’ | Vidya Balan on Manu Sharma Release | Sakshi
Sakshi News home page

మనుశర్మ విడుదలపై స్పందించిన విద్యాబాలన్‌‌

Jun 4 2020 2:43 PM | Updated on Jun 4 2020 3:02 PM

Vidya Balan on Manu Sharma Release - Sakshi

సాక్షి, ముంబై: సంచలనం సృష్టించిన మోడల్‌ జెస్సికా లాల్‌ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న మనుశర్మ విడుదలకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ స్పందించారు. ‘ఈ వ్యాఖ్యలు పూర్తిగా నా వ్యక్తిగతం. మనుశర్మకి, అతనిలాంటి నేరాలు చేసే వ్యక్తులకు ఎంత కాలం శిక్ష వేసినా సరిపోదు. దీని గురించే నా మనసులో మెదులుతూ ఉంటుంది. ఏమో తను మంచిగా మారాడేమో.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. తను మంచిగా మారాడనే ఆశిస్తున్నాను’ అన్నారు. జెస్సికా హత్య ఆధారంగా బాలీవుడ్‌లో ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2011లో వచ్చిన ఈ సినిమాలో విద్యాబాలన్‌ జెస్సికా సోదరి సబ్రినా లాల్‌ పాత్రలో నటించారు.(కథ వింటారా?

దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలిలోని టామరిండ్‌ కోర్టు రెస్టారెంట్ బార్‌లో పనిచేస్తున్న జెస్సికా లాల్‌ను 1999లో మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేశాడు. సమయం మించిపోయిన కారణంగా మద్యం సర్వ్‌ చేయడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన మనుశర్మ ఆమెను పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు మను శర్మ మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. హైకోర్టు 2006 డిసెంబర్‌లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement