నటిపై అత్యాచారం.. ప్రముఖ టీవీ నటుడిపై కేసు | TV actor Yash Pandit booked for raping actress, on the run | Sakshi
Sakshi News home page

నటిపై అత్యాచారం.. ప్రముఖ టీవీ నటుడిపై కేసు

Nov 25 2015 5:40 PM | Updated on Jul 28 2018 8:40 PM

నటిపై అత్యాచారం.. ప్రముఖ టీవీ నటుడిపై కేసు - Sakshi

నటిపై అత్యాచారం.. ప్రముఖ టీవీ నటుడిపై కేసు

ప్రముఖ టీవీ నటుడు, క్యూంకి సాస్ కభి బహు థి వంటి హిందీ సీరియళ్లలో నటించిన యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది.

ముంబై: ప్రముఖ టీవీ నటుడు, 'క్యూంకి సాస్ కభి బహు థి' వంటి హిందీ సీరియళ్లలో నటించిన యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ టీవీ నటిపై పలుమార్లు అత్యాచారం జరిపినట్టు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  28 ఏళ్ల నటిపై ఆయన ముంబై జుహూలోని తన నివాసంలో పలుమార్లు అత్యాచారం జరిపినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

మీడియా కథనాల ప్రకారం.. హిందీ సీరియళ్లలో ప్రఖ్యాత నటుడిగా పేరొందిన యశ్ పండిట్ సెప్టెంబర్ 13న సెట్ లో ఆ నటిని కలిశాడు. కొంతకాలానికి వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. మొదట తన కారులో నటిపై అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఇంటికి పిలిచి ఆమెతో లైంగికంగా గడిపాడు. మరోసారి కూడా తన ఇంటికి పిలిచి ఆమెతో గడిపాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ కాల్స్ తిరస్కరించాడు.

'నా శారీరకంగా గడిపేందుకు అతను నాతో సన్నిహితంగా మెలిగాడు. చాలామంది అమ్మాయిలతో తనకు లైంగిక సంబంధం ఉందని  అతను నాకు చెప్పాడు. అపఖ్యాతి పాలవుతామనే ఉద్దేశంతోనే వాళ్లు  పోలీసులను ఆశ్రయించి ఉండరు. కానీ, నేను అతని దుష్టబుద్ధిని బయటపెట్టి.. సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నాను' అని బాధిత నటి ఓ ప్రతికకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న యశ్ పండిట్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement