'అ ఆ' టైటిల్ ను ఫైనల్ చేశాడు.. | Trivikram Srinivas next film title a aa | Sakshi
Sakshi News home page

'అ ఆ' టైటిల్ ను ఫైనల్ చేశాడు..

Sep 10 2015 1:17 PM | Updated on Sep 3 2017 9:08 AM

'అ ఆ' టైటిల్ ను ఫైనల్ చేశాడు..

'అ ఆ' టైటిల్ ను ఫైనల్ చేశాడు..

వరుస ఘనవిజయాలతో టాలీవుడ్ను షేక్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఆసక్తి కరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. స్టార్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి, అది కుదరక పోవటంతో నితిన్తో...

వరుస ఘనవిజయాలతో టాలీవుడ్ను షేక్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఆసక్తి కరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. స్టార్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి, అది కుదరక పోవటంతో నితిన్తో సినిమా మొదలుపెడుతున్న త్రివిక్రమ్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. తన గత సినిమాలను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా కూడా చేస్తున్నాడు.

తన ప్రతి సినిమా టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మాటల మాంత్రికుడు, నితిన్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, లాంటి టైటిల్స్ తో ఆకట్టుకున్న త్రివిక్రమ్, తన కొత్త సినిమాకు 'అ ఆ' అనే టైటిల్ ను ఫైనల్ చేశాడు. 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక.

నితిన్, సమంతలు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాలి భామ ప్రేమమ్ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తుంది.  ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళుతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement