'మెగాస్టార్తో నేను నటించడం లేదు' | This is a rumour: Varun on working with Big B | Sakshi
Sakshi News home page

'మెగాస్టార్తో నేను నటించడం లేదు'

Sep 27 2016 12:56 PM | Updated on May 28 2018 3:50 PM

'మెగాస్టార్తో నేను నటించడం లేదు' - Sakshi

'మెగాస్టార్తో నేను నటించడం లేదు'

తాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలు, పుకార్లేనని బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ అన్నాడు.

ముంబయి: తాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలు, పుకార్లేనని బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ అన్నాడు. అయితే, అలాంటి లెజెండరీ నటుడిపక్కన నటించేందుకు చిన్నచోటు దక్కిన తాను సంతోషంగా భావిస్తానని, ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. 'డబ్బా గుల్' కొత్త చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించనున్న విషయం తెలిసిందే.

ఆ చిత్రంలో అమితాబ్ తోపాటు వరుణ్ కూడా ఉన్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ స్పష్టతను ఇచ్చాడు. బిగ్ బీతో నటించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదని, తాను డబ్బా గుల్ లో నటించడం ఇంకా ఫైనల్ కాలేదని, ప్రస్తుతానికి ఆ వార్తలు పుకార్లేనని అన్నాడు. ముంబయిలోని డబ్బావాలాల గురించి ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఎంబీఏ చేస్తున్న ఓ విద్యార్థి తన ఇంటర్న్ షిప్ లో భాగంగా డబ్బావాలాలతో చేరిపోయి వారి దైనందిన కార్యక్రమాలు ఎలా తెలుసుకుంటాడనే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement