సూర్యతో చేయూలని... | Surya impresses Swedish-Iranian Actress | Sakshi
Sakshi News home page

సూర్యతో చేయూలని...

Jan 12 2014 11:41 PM | Updated on Sep 2 2017 2:34 AM

సూర్యతో చేయూలని...

సూర్యతో చేయూలని...

ప్రముఖ హీరోల సరసన నటిస్తే హీరోయిన్లకు పేరుతో పాటు పారితోషికం అధికంగానే ముడుతుంది. ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. అందుకే వర్ధమాన భామలు అలాంటి అవకాశాల కోసం అర్రులు చాస్తుంటారు.

ప్రముఖ హీరోల సరసన నటిస్తే హీరోయిన్లకు పేరుతో పాటు పారితోషికం అధికంగానే ముడుతుంది. ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. అందుకే వర్ధమాన భామలు అలాంటి అవకాశాల కోసం అర్రులు చాస్తుంటారు. నటి మరియం జకరియ ఇరానీ ముద్దుగుమ్మ. అక్కడ ఐటమ్ సాంగ్‌ల సుందరిగా ప్రాచుర్యం పొందిన ఈ జాణకు మన దేశంలోనూ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో చిందేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ స్క్రీన్‌పై  తన అందాలారబోతతో మోత మోగించనుంది. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రంలో ఈ శృంగారతార ఆయనతో ఐటమ్‌సాంగ్‌లో ఆడింది. 
 
ఈ పాట చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ ఇరానీ భామ మాట్లాడుతూ హిందీలో ఏజెంట్ వినోద్ చిత్రంలో దిల్‌మేరా..అనే పాటకు కరీనాకపూర్‌తో కలసి నటించానని చెప్పింది. తమిళంలోనూ నగరం అనే చిత్రంలో ఒక ఐటమ్‌సాంగ్ చేశానని తెలిపింది. తాజాగా సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటించమని అడిగారని వెంటనే సంతోషంగా అంగీకరించానని చెప్పింది. సూర్య తనతో చాలా స్నేహంగా మసలుకున్నారని చెప్పింది. ఆయనతో కలసి ఆడుతున్నప్పుడు పని చేస్తున్నట్లే అనిపించలేదని పేర్కొంది. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఇంతకుముందు నటించానని, ఇప్పుడు ఆయన సోదరుడు రాజు సుందరం నృత్య దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. తాను సింగిల్ సాంగ్ నటినైనా సూర్యతో ఐటమ్‌సాంగ్ చేసిన తరువాత ఆయనకు జతగా నటించాలనే ఆశ పుట్టిందని మరియం జకరియ చెప్పింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement