‘లెజండ్‌’ నటి మృతి

Sujata Kumar English Vinglish Co-Star Dies - Sakshi

శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌ చిత్రం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’తో తెలుగువారికి పరిచయమై, బాలకృష్ణ ‘లెజండ్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్‌ నటి సుజాతా కుమార్‌ మృతి చెందారు. సుజాతా కుమార్‌ మరణం గురించి ఆమె సొదరి క్రిష్ణ కుమారి సోషల్‌మీడియా ద్వారా తెలియజేసారు. గత కొంతకాలంగా మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాతను చికిత్స నిమిత్తం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి చేయి దాటిపోయిందని తెల్చారు డాక్టర్లు.

ఈ క్రమంలో ఆదివారం (నిన్న) రాత్రి 11 . 26 గంటల ప్రాతంలో ఆమె మరణించారు. ఈ విషయం గురించి సుజాతా సోదరి ‘మన ప్రియమైన సుజాతా కుమార్‌ ఇక లేరు. ఆమె మనందరిని వదిలి మరోక ఉన్నతమైన ప్రదేశానికి వెళ్లారు. ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు. జీవితమెప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాక ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్టు చేశారు.

గౌరీ షిండే దర్శకత్వంలో శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంలో సుజాతా కుమార్‌ నటించారు. ఈ చిత్రంలో ఆమె అమెరికాలో సెటిల్‌ అయిన శ్రీదేవి సోదరి మను పాత్రలో మెప్పించారు. అంతేకాక ‘హోటల్‌ కింగ్‌డమ్‌’, ‘బాంబే టాకింగ్‌’, ‘24’ అనే ధారావాహికల్లోనూ సుజాత నటించారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో సుజాత ఆయనకు బామ్మగా నటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top