కూతురి ప్రేమకు శ్రీదేవి ఓకే? | Sakshi
Sakshi News home page

కూతురి ప్రేమకు శ్రీదేవి ఓకే?

Published Sat, Nov 26 2016 12:45 AM

కూతురి ప్రేమకు శ్రీదేవి ఓకే?

‘‘ఇలాంటివన్నీ చేస్తే కుదరదు. బుద్ధిగా కెరీర్ మీద దృష్టి పెట్టు. లవ్వు గివ్వు అంటూ తిరిగావో బాగుండదు’’ అని తన పెద్ద కుమార్తె జాహ్నవీ కపూర్‌కి నటి శ్రీదేవి వార్నింగ్ ఇచ్చారనే వార్త ఈ మధ్య హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మరి... ఈ వార్త అబద్ధమో లేక తల్లితండ్రులైన శ్రీదేవి, బోనీకపూర్లను జాహ్నవి ఒప్పించారామో తెలియదు కానీ.. మొత్తం మీద తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా (ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు)ను పేరెంట్స్‌కి దగ్గర చేసినట్లు తెలుస్తోంది.

దానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఆలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌కు అమ్మానాన్న, లవర్ శిఖర్‌తో కలిసి ఒకే కారులో జాహ్నవి హాజరు కావడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా కెమెరాలన్నీ వాళ్లపై ఫోకస్ అయ్యాయి. ఇప్పుడీ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో జాహ్నవి, శిఖర్‌ల ప్రేమకు బోనీ, శ్రీదేవి ఒప్పుకున్నట్లేననే చర్చ మొదలైంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్.

Advertisement

తప్పక చదవండి

Advertisement