షాహీద్ తో అఫైర్ లేదు: సోనాక్షి | Sonakshi Sinha 'annoyed' with Shahid Kapoor link-up rumours | Sakshi
Sakshi News home page

షాహీద్ తో అఫైర్ లేదు: సోనాక్షి

Apr 3 2014 8:00 PM | Updated on Sep 2 2017 5:32 AM

షాహీద్ తో అఫైర్ లేదు: సోనాక్షి

షాహీద్ తో అఫైర్ లేదు: సోనాక్షి

ఆర్.. రాజ్ కుమార్ చిత్రంలో నటించినంత మాత్రాన షాహీద్ తో లింక్ పెట్డడం తనను బాధిస్తోందని ఆమె అన్నారు ఆర్..

బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తో అఫైర్ లేదని సోనాక్షి సిన్హా తెలిపింది. ఆర్.. రాజ్ కుమార్ చిత్రంలో నటించినంత మాత్రాన షాహీద్ తో లింక్ పెట్డడం తనను బాధిస్తోందని ఆమె అన్నారు. ఇలాంటి వార్తల కారణంగా పార్టీలకు వెళ్లాలన్నా, బయట అడుగుపెట్టాలన్నా భయమేస్తోందని సోనాక్షి తెలిపారు.
 
షాహీద్ తో ఎప్పుడు మాట్లాడానో, కలిశానో గుర్తులేదని.. కాని మాఇద్దరిపై మీడియాలో ఏవేవో కట్టుకథలు రావడం ఇబ్బందిగా ఉందన్నారు. అదృష్టవశాత్తూ తన గురించి తల్లితండ్రులకు తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవని.. వారు మంచిగా అర్ధం చేసుకున్నారని సోనాక్షి అన్నారు. ఆర్...రాజ్ కుమార్ చిత్రంలో షాహీద్ తో కలిసి నటించిన తర్వాత ఇద్దరి మధ్య అఫైర్ కొనసాగుతోందని రూమర్లు ఎక్కువయ్యాయి. తమపై వస్తున్న రూమర్లను సోనాక్షి ఖండించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement