అలీపై శివాజీరాజా గెలుపు | sivaji raja wins over ali in maa elections | Sakshi
Sakshi News home page

అలీపై శివాజీరాజా గెలుపు

Apr 17 2015 12:07 PM | Updated on Sep 3 2017 12:25 AM

అలీపై శివాజీరాజా గెలుపు

అలీపై శివాజీరాజా గెలుపు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికయ్యారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికయ్యారు. సహచర కమెడియన్ అలీపై ఆయన విజయం సాధించారు. వాస్తవానికి ఓ దశలో తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శివాజీరాజా ప్రకటించారు. అయితే, అప్పటికే విరమణకు గడువు ముగిసిపోయింది. దాంతో ఆయన కూడా పోటీలో ఉన్నట్లు అయింది.

తాను పోటీలో ఉండట్లేదని, అందువల్ల తనకు వేయదలచుకున్న ఓట్లను కూడా తన బావ అలీకే వేయాలని కోరినట్లు విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన శివాజీరాజా తెలిపారు. తాము ఇప్పుడు హీరోలుగా కనపడొచ్చు గానీ, వాస్తవానికి రెండేళ్ల పదవీకాలంలో తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన తర్వాతే అసలైన హీరోలు అవుతామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement