వారిపై కేసు వేస్తా | Shruti Haasan to file a case against people who released | Sakshi
Sakshi News home page

వారిపై కేసు వేస్తా

Apr 29 2014 1:07 AM | Updated on Sep 2 2017 6:39 AM

వారిపై కేసు వేస్తా

వారిపై కేసు వేస్తా

వారిపై కేసు వేస్తానంటున్నారు నటి శ్రుతి హాసన్. ఈ బ్యూటీ ఇటీవల పలు వివాదాలకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

 వారిపై కేసు వేస్తానంటున్నారు నటి శ్రుతి హాసన్. ఈ బ్యూటీ ఇటీవల పలు వివాదాలకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది వ్యక్తిగతం కంటే వృత్తిపరంగానే అధికంగా జరుగుతోంది. శ్రుతి గ్లామర్ విషయంలో మితిమీరుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సెలబ్రిటీ వారసురాలు తొలి చిత్రం లక్ (హిందీ)లోనే బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ మధ్య డిడే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో శృంగారాన్ని ఒలకబోయడంతో హద్దులు మీరారనే ప్రచారం హోరెత్తింది. ఇక తెలుగు చిత్రం రేసుగుర్రంలోని ఒక పాటలో ఈ బ్యూటీ చేసిన హాట్ హాట్ నృత్యం కుర్రకారుకు గుబులు పుట్టించగా అలాంటి ఫొటోలతో కూడిన పోస్టర్లు ట్రాఫిక్ జామ్ చేశాయి.
 
 దీంతో పోలీసులు, మహిళా సంఘాలు తమ చేతులకు పని కల్పించాల్సి వచ్చింది. గ్లామర్‌కు కూడా ఒక హద్దు ఉంటుందని వారు కొన్ని చోట్ల ఆ వాల్ పోస్టర్లను చింపేశారు. ఇలా ఒక్కో చిత్రంతో, ఒక్కో రకమైన వివాదానికి తావిస్తూ వస్తున్న శ్రుతి హాసన్ తాజాగా తన అశ్లీల ఫొటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా అందుకు కారణమైన వారిపై కేసు వేయనున్నట్లు ప్రకటించారు. శ్రుతి ఇంతకు ముందు తెలుగులో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో నటించారు. అందులోని ఆమె గ్లామరస్ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఆ చిత్ర నిర్మాతగానీ, స్టిల్ ఫొటో గ్రాఫర్‌గానీ అయ్యి ఉంటారని శ్రుతి అనుమానిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement