శభాష్‌గా తెరకెక్కిస్తున్నారు | shruti haasan acting in Kamal Haasan Sabash movie | Sakshi
Sakshi News home page

శభాష్‌గా తెరకెక్కిస్తున్నారు

Dec 15 2016 2:41 AM | Updated on Sep 4 2017 10:44 PM

శభాష్‌గా తెరకెక్కిస్తున్నారు

శభాష్‌గా తెరకెక్కిస్తున్నారు

నాన్న శభాష్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు క్రేజీ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. ఈ బ్యూటీ ఏ చిత్రం గురించి చెబుతున్నారో ఈ పాటికే అందరికీ అర్థం అయ్యి ఉంటుంది.

నాన్న శభాష్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు క్రేజీ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. ఈ బ్యూటీ ఏ చిత్రం గురించి చెబుతున్నారో ఈ పాటికే అందరికీ అర్థం అయ్యి ఉంటుంది. శ్రుతిహాసన్‌ తొలిసారిగా తన తండ్రి, విశ్వనటుడు కమలహాసన్‌తో కలిసి నటిస్తున్న చిత్రం శభాష్‌నాయుడు. కమల్‌ స్వీయ దర్శకత్వంలో తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శభాష్‌నాయుడు తదుపరి షెడ్యూల్‌ కమల్‌ తన కార్యాలయంలోని మెట్ల మీద నుంచి కాలు జారి పడి ఆస్పత్రిలో చేరడం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజగా ఈ చిత్ర షూటింగ్‌కు కమలహాసన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

జనవరి తొలి వారంలో శభాష్‌నాయుడు మళ్లీ సెట్‌పైకి వెళ్లనుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌ శభాష్‌నాయుడు చిత్రం గురించి తెలుపుతూ నాన్న చిత్రాన్ని బ్రహ్మాండంగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారనని చెప్పారు. ఆయన సన్నివేశం సంతృప్తిగా వచ్చే వరకూ తీస్తూనే ఉంటారని తెలిపారు.అంతగా దృష్టి పెట్టి శభాష్‌నాయుడికి రూపకల్పన చేస్తున్నారని వివరించారు. తనకు నచ్చేవరకూ మరో సన్నివేశం జోలికి వెళ్లరని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం తనకు అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నారు. అయితే నాన్నతో నటించడానికి మొదట చాలా భయపడ్డానని శ్రుతిహాసన్‌ అన్నారు. ప్రస్తుతం ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ తెలుగులో పవన్‌కల్యాణ్‌తో రొమాన్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement