వెండితెరపైకి  సానియా ఆట | Sania Mirza announces making of biopic on her career | Sakshi
Sakshi News home page

వెండితెరపైకి  సానియా ఆట

Feb 10 2019 12:41 AM | Updated on Apr 3 2019 6:34 PM

Sania Mirza announces making of biopic on her career - Sakshi

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులోనూ ముఖ్యంగా స్పోర్ట్స్‌ బయోపిక్‌లకు మంచి క్రేజ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ‘మేరీకోమ్, దంగల్, గోల్డ్, భాగ్‌ మిల్కా భాగ్, ఎమ్‌ఎస్‌. ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ వంటి స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ అన్నింటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఆల్రెడీ కొన్ని స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ సెట్స్‌పై ఉన్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ హైదరాబాదీ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా ఓ నిర్మాత. సానియా మీర్జా బయోపిక్‌ రాబోతుందని వచ్చిన వార్తను సానియా రీ ట్వీట్‌ చేయడంతో ఆమె బయోపిక్‌ కన్ఫార్మ్‌ అంటున్నారు సినీ లవర్స్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement