ప్రధానమంత్రిగా... | Vivek Oberoi to play PM Modi in Biopic | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రిగా...

Dec 30 2018 4:20 AM | Updated on Apr 3 2019 6:23 PM

Vivek Oberoi to play PM Modi in Biopic - Sakshi

వివేక్‌ ఒబెరాయ్‌

బాలీవుడ్‌లో బయోపిక్స్‌ గాలి బాగా వీస్తోంది. ఇప్పటికే అరడజను బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది బయోపిక్‌ బాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. టైటిల్‌ రోల్‌లో బాలీవుడ్‌ నటుడు నటిస్తారని టాక్‌. బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరికోమ్‌ బయోపిక్‌ను తెరకెక్కించి, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌ ఖబర్‌.

ఆల్రెడీ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్,  ఉత్తరాఖండ్‌లో లొకేషన్స్‌ని అన్వేషిస్తున్నారట టీమ్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బయోపిక్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌ తెరపైకి రావడం విశేషం. ఇదిలా ఉంటే.. ‘రక్తచరిత్ర, వివేగమ్‌’ వంటి దక్షిణాది చిత్రాల్లో నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ‘వినయ విధేయ రామ’లో విలన్‌ పాత్ర చేశారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement