నేను బాగానే ఉన్నాను..! | Samantha decides to speak about the rumors on her illness | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఉన్నాను..!

Dec 14 2013 1:36 AM | Updated on Sep 2 2017 1:34 AM

నేను బాగానే ఉన్నాను..!

నేను బాగానే ఉన్నాను..!

బిజీ హీరోయిన్ సమంత ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొద్దికాలంగా ఆమె ఆరోగ్యపరిస్థితి అంత బాగా లేదనే రూమర్లు సమంతను చుట్టుముడుతున్నాయి.

 బిజీ హీరోయిన్ సమంత ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొద్దికాలంగా ఆమె ఆరోగ్యపరిస్థితి అంత బాగా లేదనే రూమర్లు సమంతను చుట్టుముడుతున్నాయి. అయితే తనకు బాగానే ఉందని, తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నాను మొర్రో అని ఎంతగా తల బాదుకున్నా... ఈ పుకార్ల షికార్లకు మాత్రం బ్రేకులు పడలేదు. దాంతో తాను షూటింగ్‌లో పాల్గొన్న చిత్రాలను హెల్త్ బులిటెన్ తరహాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీవీ వినాయక్ చిత్రానికి సంబంధించి ఇటీవల జపాన్‌లో చేస్తున్న షూటింగ్ ఫొటోలను పోస్ట్ చేశారామె. రెగ్యులర్‌గా తన చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ రూమర్లకు తెరదించుకునే ప్రయత్నం చేస్తున్నారు సమంత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement