ఎవరిపై పగ? | Ritu Varma teams up with Nikhil Siddhartha for next | Sakshi
Sakshi News home page

ఎవరిపై పగ?

Aug 28 2016 11:29 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఎవరిపై పగ?

ఎవరిపై పగ?

‘స్వామి రారా’తో తెలుగులో మళ్లీ క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త ఊపిరి అందించిన హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ

 ‘స్వామి రారా’తో తెలుగులో మళ్లీ క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త ఊపిరి అందించిన హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మ కలయికలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత అభిషేక్ నామా క్లాప్ ఇవ్వగా, నామా మధుసూదన రావు కెమేరా స్విచాన్ చేశారు. ‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ రివెంజ్ డ్రామాలో ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుంది’’ అని సుధీర్‌వర్మ తెలిపారు. ‘‘సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత. ఇందులో రీతూ వర్మ హీరోయిన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement