ఒకే ఫ్రేంలో మెగా వారసులు.. కానీ!

Ram Charan Tej Shares Mega Family Photo With Akira Nandhan - Sakshi

మెగా కుటుంబం సంక్రాంతి పర్వదినాన అభిమానులకు కనువిందును కలిగించింది. మెగా స్టార్‌ చిరంజీవితో కలిసి మెగా, అల్లు ఫ్యామిలీ వారసులంతా ఒకే ఫ్రేంలో మెరిసారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తేజ్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘హ్యాపి సంక్రాంతి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్ తేజ్, మెగా అల్లుడు కల్యాణ్‌ దేవ్‌, అల్లు వారసులు అల్లు అర్జున్‌, శిరీష్‌లతో పాటు పవన్‌ కల్యాణ్‌, రేణుదేశాయ్‌ల తనయుడు అకీరా నందన్‌ కూడా ఉన్నాడు. ఎప్పుడూ సినిమాలతో బీజీగా ఉండే మెగా ఫ్యామీలిని ఒకేచోట చూసి అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. పండుగ సందర్బంగా అందరూ ఒక్కచోట చేరిన ఈ ఫొటోకు అభిమానులంతా ‘మెగా ఫ్రేంలో పవన్‌ కల్యాణ్, నాగబాబులు మిస్సయ్యారు’  అని ‘మెగా ఫ్యామిలీలో క్రికెట్‌ టీంకు సరిపడ హీరోలు ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Happy Sankranti !!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on

ఇక ఈ ఫొటోలో మెగాస్టార్‌ చిరంజీవి క్రీం కలర్‌ పంచెకట్టులో ఉండగా ఆయన చూట్టూ రామ్‌ చరణ్‌, వరణ్‌ తేజ్‌, బన్నీ, శీరిష్‌, సాయిధరమ్‌ తేజ్‌ అకీరాలు బ్లాక్‌ అండ్‌ బ్లూ కాంబీనేషన్‌ దుస్తులను ధరించి ఉన్నారు. పండుగా పూట మెగా వారుసలంతా ఒకేచోట ఉండటంతో.. మెగా అభిమానుల సంక్రాంతి సంబరాలు ఇంకాస్తా పెరిగాయని చెప్పుకోవచ్చు. అలాగే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా తన భర్త ‍కళ్యాణ్‌ దేవ్‌, కూతుళ్లతో కలసి ఉన్న ఫొటోకు ‘హ్యాపి బోగి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. కాగా కొరటాల శివ దర్వకత్వంలో  చిరంజీవి 152వ చిత్రం రానుంది. రామ్‌ చరణ్‌, వరణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌లు వారి వారి సినిమాలో బిజీగా ఉండగా. బన్నీ తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top