సూపర్‌ స్టార్‌కు సోషల్ మీడియా సలాం | Rajinikanth Birthday Wishes Trending In Social Media | Sakshi
Sakshi News home page

Dec 12 2018 10:14 AM | Updated on Dec 12 2018 10:37 AM

Rajinikanth Birthday Wishes Trending In Social Media - Sakshi

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. అభిమానులతో పాటు సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు రజనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌లతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, త్రిష, సుశాంత్‌, కస్తూరి లాంటి సినీ తారలు, నిర్మాణ సంస్థలు దర్శకులు తలైవాకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.

ఇక ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అభిమానుల సందడి మామూలుగా లేదు. ‘హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌’ (#HBDSuperStarRajinikanth) అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement