బాహుబలి 3పై ప్రభాస్‌ కామెంట్‌

Rajamouli May Do Baahubali Three: Prabhas - Sakshi

బెంగుళూరు: ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. రాజమౌళికి ఉత్సుకత ఉంటే బాహుబలి 3 కూడా తెరకెక్కే అవకాశం ఉందన్నాడు. సినీ చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనం మనందరికి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజమౌళి ఉత్సాహంగా ఉంటే బాహుబలి-3 కూడా రావొచ్చని అభిప్రాయపడ్డాడు. తాము బాహుబలి రెండు భాగాల్లో దాదాపు 60% కథను మాత్రమే పూర్తి చేశామని చెప్పాడు. రాజమౌళి మదిలో బాహుబలి  సీక్వెల్‌-3 కూడా ఉందన్నాడు. అయితే అది కార్యరూపం దాల్చే అవకాశాల గురించి మాత్రం తనకు తెలియదన్నాడు.

ఇక బాహుబలితో తన అనుబంధాన్ని పంచుకుంటూ  నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించినందుకు తనకు ఏ మాత్రం బాధలేదన్నాడు. నా జీవితంలో అమరేంద్రబాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నాడు. కొన్నిసార్లు ఈ సినిమా కథలో లీనమయ్యి తనను తానే మర్చిపోయే సంఘటనలు కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు. కాగా భారీ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన సాహోఆగష్టు 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top