‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

PV Sindhu Picks Deepika Padukone Name For Her Biopic - Sakshi

వరల్డ్‌  బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై విపరీతమైన చర్చ జరుగుతుంది. సింధు పాత్రకు సంబంధించి పలువురు నటీమణుల పేర్లు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.

ప్రముఖ నటి సమంత తెరపై సింధుగా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని జాతీయ మీడియా సింధును ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చిన సింధు బాలీవుడ్‌ భామ దీపికా పదుకోన్‌ పేరు చెప్పింది. తన పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తే బాగుంటుందని పేర్కొంది. దీపికా బ్యాడ్మింటన్‌ బాగా ఆడుతుందని.. మంచి నటి కూడా అని కితాబిచ్చాంది. కానీ నిర్మాతలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. తాను వారి నిర్ణయానికి గౌరవమిస్తానని తెలిపింది.

ప్రస్తుతం దీపికా కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తుంది. ఈ చిత్రంలో జనవరి 2020లో ప్రేక్షకులు మందుకు రానుంది. కాగా, దీపికా తండ్రి ప్రకాశ్‌ పదుకోన్‌ మాజీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అన్న సంగతి తెలిసిందే. దీపికా కూడా టీనేజీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రాణించింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌కు గుడ్‌ బై చెప్పి సినీ రంగంలోకి ప్రవేశించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top