ప్రియుడితో ముంబై వచ్చిన ప్రియాంక

Priyanka Chopra Lands With Nick Jonas In Mumbai - Sakshi

ముంబై : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. అంతేకాదు ఆమె వెంట ప్రియుడు నిక్‌ జోనాస్‌ను సైతం తీసుకొచ్చారు. ప్రియాంక, నిక్‌లు కలసి కారులో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, మీడియా కంట పడకుండా ఉండేందుకు నిక్‌ కారు కర్టెన్‌ను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు.

కాగా, నిక్‌ ఇప్పటికే ప్రియాంకను తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. నిక్‌ తరఫు బంధువుల పెళ్లికి కూడా ప్రియాంక హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంక నిక్‌ను ఆమె తల్లికి పరిచయం చేసేందుకు ముంబై తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, నిక్‌ తల్లి మధు విదేశీయుడికి తన కూతురిని కట్టబెట్టడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

ప్రియాంక ఇటీవల ముంబైలోని వార్సోవా బీచ్‌ వద్ద విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ జరిగే గృహప్రవేశ కార్యక్రమానికి నిక్‌ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top