అతనితో పెళ్లికి ఒప్పుకోను : ప్రియాంక తల్లి

I Will Not Accept Priyanka To Marry Nick Says Mother - Sakshi

సినిమా : హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌ ప్రేమలో ఉన్నారనే వార్త నెట్టింట్లో కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై స్పందించిన ప్రియాంక తల్లి మధు చోప్రా సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఒకవేళ నిక్‌తో ప్రియాంక పెళ్లికి సిద్ధపడితే అందుకు తాను ఒప్పుకోనని చెప్పారు.

విదేశీయుడిని ప్రియాంక పెళ్లి చేసుకుంటే తాను భరించలేనని చెప్పారు. ప్రియాంక జీవితాంతం వివాహం చేసుకోకపోయినా తనకు ఇష్టమే కానీ, విదేశీయుడిని చేసుకోవడానికి మాత్రం అంగీకరించనని ఆమె పేర్కొన్నారు. దంపతులు ఒకే కులానికి చెందిన వారైతే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు నిక్‌ విషయంలో తనపై వస్తున్న వదంతుల గురించి ప్రియాంక ఇంకా స్పందించలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top