
కొత్త చిత్రానికి ప్రభాస్ కొబ్బరికాయకొట్టాడోచ్
దాదాపు నాలుగేళ్లపాటు బాహుబలి సినిమాకోసం తీవ్రంగా శ్రమించి బాహుబలి-2కి గత నెల (జనవరి) 6నే గుమ్మడి కాయకొట్టి విశ్రాంతి తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పుడే కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు.
ఈ కార్యక్రమంలో సుజీత్, చిత్ర నిర్మాతలు, ప్రభాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాహుబలి-2 చిత్ర షూటింగ్ పూర్తయ్యాక గడ్డం, పొడుగాటి జుట్టుతోనే కనిపించిన ప్రభాస్.. కొత్త చిత్ర ముహూర్తం రోజు కూడా అదే గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లలో ఈ సినిమా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రంపై వస్తోంది. దీనికి శంకర్ ఈ ఎశాన్ లాయ్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

