రక్తం కారేలా లిప్‌లాక్! | Noah: Emma Watson suffered bleeding lips in kissing scene with Douglas Booth | Sakshi
Sakshi News home page

రక్తం కారేలా లిప్‌లాక్!

Apr 2 2014 11:20 PM | Updated on Sep 2 2017 5:29 AM

రక్తం కారేలా లిప్‌లాక్!

రక్తం కారేలా లిప్‌లాక్!

ముద్దంటే చేదా అనేది పాతకాలపు నాటి మాట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో లిప్‌లాక్ ఉన్న ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. యువ హీరో, హీరోయిన్లు ఎలాంటి సంకోచం లేకుండా గాఢ చుంబనానికి సై అంటున్నారు.

ముద్దంటే చేదా అనేది పాతకాలపు నాటి మాట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో లిప్‌లాక్ ఉన్న ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. యువ హీరో, హీరోయిన్లు ఎలాంటి సంకోచం లేకుండా గాఢ చుంబనానికి సై అంటున్నారు. ఇక హాలీవుడ్‌లో అయితే చెప్పనక్కర్లేదు. అయితే ‘హ్యారీ పోటర్’ హీరోయిన్ ఎమ్మా వాట్సన్‌కు ముద్దు సీన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ‘నోవా’ అనే రచన ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో డ గ్లస్ బూత్‌కు భార్యగా ఎమ్మా నటిస్తోంది. ఈ చిత్రంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరూ గాఢంగా ముద్దుపెట్టుకునే సీన్‌లో నటించారు. అయితే ఆ సన్నివేశాన్ని అనుకున్న విధంగా తీయడానికి నాలుగైదు సార్లు షూటింగ్‌లో సీన్‌ను రిపీట్ చేశారట. ఆ ముద్దు సీన్‌లో ఎమ్మా పెదాలకు గాయమై రక్తం కారిందట. దాంతో ఆమెకు ప్రథమ చికిత్స తప్పలేదు. ‘ముద్దు సీన్‌లో నా పెదవికి గాయమై రక్తం కారింది. డగ్లస్ ముక్కుకు కూడా గాయమైంద’ని వాట్సన్ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement