ఇక సహించేది లేదు!

Nithya Menen React on Social Media Trolling - Sakshi

సినిమా: ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇకపై సహించేది లేదు అని మండిపడుతోంది నటి నిత్యామీనన్‌. ఇంతకీ ఈ మలయాళీ భామకు అంతగా కట్టలు తెచ్చుకునేంత కోపం రావడానికి కారణం ఏమైఉంటుంది? ఇప్పటి వరకూ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోనే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు కొత్తగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నిత్యామీనన్‌ నటించిన తొలి హిందీ చిత్రం మిషన్‌ మంగళ్‌ శుక్రవారం తెరపైకి వచ్చింది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో విద్యాబాలన్‌ నటించారు. ఇక నటి నిత్యామీనన్‌ విషయానికి వస్తే కేరళలో వరదముప్పుతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  నటుడు సూర్య, కార్తీ కూడా కేరళ, కర్ణాటక ప్రజలను ఆదుకునేలా రూ.10 లక్షలు అందించారు.

ఇలాంటి సమయంలో నటి నిత్యామీనన్‌ సామాజిక మాధ్యమాల్లో తన చిత్రాల ఫొటోలను, వాటి వివరాలను పోస్ట్‌ చేసుకుంటుందేగానీ ప్రజల వెతల గురించి ఒక్క మాటను కూడా పేర్కొనలేదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అదే నిత్యామీనన్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తన గురించి జరుగుతున్న ప్రచారానికి బదులిచ్చేలా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో  సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్‌లను పట్టించుకోను. అయితే ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలను సహించేది లేదు.  నేను సామాజికమాధ్యమాల్లో పొందుపరచనంతమాత్రాన, ఎలాంటి సహాయం చేయలేదని అర్థం కాదు అని నిత్యామీనన్‌ పేర్కొంది. అయితే ఇప్పటికీ తను చేసిన సహాయం ఏమిటో చెప్పని సంచలన నటి. త్వరలో ప్రారంభం కానున్న జయలలిత బయోపిక్‌ ది ఐరన్‌ లేడీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. జయలలిత పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.అందుకోసం చాలా కసరత్తులు చేస్తోందట. ఇకపోతే మిషన్‌ మంగళ్‌ చిత్రం ఈ అమ్మడి బాలీవుడ్‌ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తుందో చూడాలి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top