
నిఖిల్
ప్రేమ ఇష్క్ కాదల్, కార్తికేయ చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేని మెగాఫోన్ చేపట్టనున్నారు. కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో నిఖిల్ వెంటనే పచ్చజెండా ఊపేశారు.
ప్రేమ ఇష్క్ కాదల్, కార్తికేయ చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేని మెగాఫోన్ చేపట్టనున్నారు. కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో నిఖిల్ వెంటనే పచ్చజెండా ఊపేశారు. ‘భద్రాద్రి’, ‘ఆకాశంలో సగం’ చిత్రాలు నిర్మించిన మల్కాపురం శివకుమార్ సురక్ష్ గ్రూప్ కంపెనీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇదొక వినూత్న కథాంశమని, వినోదానికి పెద్ద పీట వేస్తున్నామని, నిఖిల్ పాత్రచిత్రణ సరికొత్త రీతిలో ఉంటుందని, మార్చిలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు.