షో డైరెక్టర్తో క్వీన్..!

షో డైరెక్టర్తో క్వీన్..! - Sakshi


బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కేవలం కన్నడ రీమేక్ మాత్రమే మొదలైంది.



తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా క్వీన్ రీమేక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. షో, మిస్సమ్మ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట. తమన్నా లేదా కాజల్ లలో ఒకరు లీడ్ రోల్ లో నటించే అవకాశం ఉంది. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారా..? లేక కేవలం తెలుగు వర్షన్ మాత్రమే రూపొందిస్తారన్న అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top