ఇక రఫ్ ఆడేస్తా! . | Nayantara Re-entry in Tollywood | Sakshi
Sakshi News home page

ఇక రఫ్ ఆడేస్తా! .

Dec 11 2015 3:20 AM | Updated on Sep 18 2019 2:52 PM

ఇక  రఫ్ ఆడేస్తా!  . - Sakshi

ఇక రఫ్ ఆడేస్తా! .

ఇకపై రఫే నంటోంది నటి నయనతార. నటన పరంగానే కాదు, వ్యక్తిగత జీవితం నయనతారను

ఇకపై రఫే నంటోంది నటి నయనతార. నటన పరంగానే కాదు, వ్యక్తిగత జీవితం నయనతారను సంచలన తారగా పేరు తెచ్చుకోవడానికి దోహదం అయ్యాయని చెప్పవచ్చు. రీ ఎంట్రీలో కూడా ఆమెను నంబర్‌వన్ హీరోయిన్‌గా నిలబెట్టడానికి ఇలాంటివి పలు కారణాలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉన్న నయనతార తాజాగా టాలీవుడ్‌లోను రీఎంట్రీ అవుతోంది. కాగా తను ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతోంది.
 
  శ్రీరామరాజ్యం చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో ఒదిగిపోయిన ఈ మలయాళి భామ ఇతర ప్రేమకథా పాత్రల్లోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకుంది. అయితే ఇకపై అలాంటి పాత్రలకు చెల్లుచీటి ఇచ్చేయాలనుకుంటుందట. నయనలోని ఈ సడన్ మార్పునకు కారణం ఏమిటని ఆరా తీస్తే తమిళంలో ఆమె నటిస్తున్న తిరునాళ చిత్రమే కారణం అని తెలిసింది. అందులో నయనతార రౌడీ యువతిగా నటిస్తోంది.
 
 నోటిలోంచి బ్లేడులు కూడా తీసేంత రఫ్ పాత్రను అందులో చేస్తుంది. జీవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. నయనతార నోట్లో నుంచి బ్లేడ్లు తీసే దృశ్యాలను ఆమె అభిమానులు బాగా లైక్ చేస్తున్నారట. దీంతో ఇకపై సాఫ్ట్‌నకు పుల్‌స్టాప్ పెట్టేసి తనలోని రఫ్ కోణాన్ని ఆవిష్కరించాలనే నిర్ణయానికి నయనతార వచ్చిందనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement