సామ్‌ నెక్స్ట్‌ నువ్వే....?

Nagachaitanya Completed The Fitness Challenge And Tag Samanta For The Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో చాలెంజ్‌లు ట్రెండ్‌ అవుతుంటాయి. ఈ కోవలోనే గతంలో ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌, ప్యాడ్‌మాన్‌ చాలెంజ్‌లు ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్‌ పతక విజేత, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్‌, హృతిక్‌, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు.

ఇప్పుడు ఈ కోవలోకి అక్కినేని కుటుంబం చేరింది. తాజాగా నాగచైతన్య ఈ చాలెంజ్‌ను స్వీకరించి, ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. నాగ చైతన్యను అఖిల్‌ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య తన భార్య సమంతను, అక్కినేని సుమంత్‌, నిధి అగర్వాల్‌కు ఫిట్‌నెస్‌ సవాలును విసిరారు. దీని గురించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్‌ మెసేజ్‌ పోస్టు చేశారు. ‘హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్‌ చాలెంజ్‌ నాకు చాలా నచ్చింది. కళ్లకు, మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. చై నేను నీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను. కానీ నువ్వు పోస్టు చేసిన వీడియో చూసి నేను అలసిపోయాను. కాబట్టి రేపు నేను నీ సవాల్‌ను పూర్తి చేస్తాను’ అంటూ పోస్టు చేశారు.

సమంత పోస్టు చేయబోయే ఎక్సర్‌సైజ్‌ వీడియో కోసం చై కంటే కూడా సామ్‌ అభిమానులే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మహానటి చిత్రంలో మధురవాణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం యూ టర్న్‌ సినిమాలో స్వయంగా తానే నటిస్తూ తొలిసారిగా నిర్మాతగా మారారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top