బ్యాట్‌ పట్టేదేవరు? | Mithali Raj's biopic kicks off in these two actresses, who will get the chance | Sakshi
Sakshi News home page

బ్యాట్‌ పట్టేదేవరు?

Jan 25 2018 1:26 AM | Updated on Jan 25 2018 1:26 AM

Mithali Raj's biopic kicks off in these two actresses, who will get the chance  - Sakshi

యస్‌.. బ్యాట్‌ పట్టి క్రీజ్‌లో బాదేదెవరు? గ్రౌండ్‌లో ఆపోజిట్‌ టీమ్‌ని పరిగెత్తించేదెవరు? తాప్సీనా లేక సోనాక్షి సిన్హానా? వీరిద్దరిలో ఎవరు?... ఇదిగో ఇలాంటి చర్చే ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతోంది. ఇంతకీ అసలు కహానీ ఏంటంటే.. ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద బయోపిక్స్‌ మంత్రం ఎలా వర్క్‌ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్‌గా ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైలోని ఓ ప్రముఖ నిర్మాణసంస్థ ఆల్రెడీ రైట్స్‌ను దక్కించుకున్నారట.

అయితే మిథాలీ పాత్రకు సోనాక్షి సిన్హా, తాప్సీలను ఆ నిర్మాణ సంస్థ సంప్రదించారని బాలీవుడ్‌ టాక్‌. ఆల్రెడీ సందీప్‌సింగ్‌ బయోపిక్‌లో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించారు. సో... తాప్సీనే ఫైనల్‌గా ఫిక్స్‌ అవుతారని కొందరు అంటుంటే.. లేదు..లేదు.. సోనాక్షి సిన్హానే సెలక్ట్‌ అవుతారని మరికొందరు అంటున్నారు. తాప్సీ బ్యాట్‌ పట్టుకుంటారా లేక తొలి బయోపిక్‌ కోసం సోనాక్షి బ్యాట్‌ పట్టుకుంటారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement