ఎప్పుడు పెళ్లి చేసుకుందాం.. | Middle Class Abbayi (MCA) Teaser released | Sakshi
Sakshi News home page

'నువ్వు నాకు బాగా నచ్చావ్‌.. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం'

Nov 10 2017 11:26 AM | Updated on Nov 10 2017 11:55 AM

Middle Class Abbayi (MCA) Teaser released - Sakshi

వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్‌ స్టార్‌ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన 'ఫిదా' స్టార్‌ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దీపావళికి విడుదల చేసింది చిత్ర యూనిట్‌. లుంగీ కట్టుకొని చేతిలో పాల ప్యాకెట్‌ పట్టుకొని.. పల్లెలో పక్కా మాస్‌లుక్‌తో నాని ఈ ఫస్ట్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ని నెటిజన్లను ఆకట్టుకుంది. 

తాజాగా టీజర్ విడుదల చేసి నాని అభిమానుల్లో జోష్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో ఎంసీఏకు అసలు సిసలు అర్థం చెప్పాడు నాని. టీజర్‌లో అసలు ఎంసీఏ అంటే ఏంటి అదేమన్నా క్వాలిఫికేషనా అని అడిగిన ప్రెండ్‌తో నాని చెప్పిన డైలాగ్స్ అలరించాయి. 'ఎంసీఏ అంటే మైండ్‌సెట్‌. ఎప్పుడైనా షర్ట్‌ బటన్‌ వూడిపోతే పిన్నీస్‌ పెట్టుకుని మ్యానేజ్‌ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్‌ చేసి టోర్న్‌ జీన్స్‌లా కలర్‌ ఇచ్చావా?

అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయని’  అంటూ నాని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సాయి పల్లవి ‘నువ్వు నాకు బాగా నచ్చావ్‌. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’  అని నానిని అడగటం టీజర్‌లో హైలైట్‌. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement