ఆమె వెంట పడుతున్న మెగా హీరోలు | mega heroes running after rakul | Sakshi
Sakshi News home page

ఆమె వెంట పడుతున్న మెగా హీరోలు

Feb 25 2016 11:57 AM | Updated on Jul 23 2019 11:50 AM

ఆమె వెంట పడుతున్న మెగా హీరోలు - Sakshi

ఆమె వెంట పడుతున్న మెగా హీరోలు

మెగా కాంపౌండ్లో ఒక హీరో సరసన హీరోయిన్గా నటిస్తే చాలు మిగతా హీరోలతో ఈజీగా ఛాన్స్ వచ్చేస్తుంది. అదే బాటలో ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోయిన్ మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది.

మెగా కాంపౌండ్లో ఒక హీరో సరసన హీరోయిన్గా నటిస్తే చాలు.. మిగతా హీరోలతో ఈజీగా ఛాన్స్ వచ్చేస్తుంది. అదే బాటలో ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోయిన్ మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ సరసన ఓ సినిమాలో నటించిన ఈ బ్యూటీ అదే ఫ్యామిలీ హీరోలతో మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యింది.

బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన రకుల్ప్రీత్ సింగ్ ఇప్పుడు వరుసగా మెగా హీరోలతోనే సినిమాలకు కమిట్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'సరైనోడు' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తనీఒరువన్ రీమేక్‌లోనూ చెర్రీతో జోడీ కడుతోంది. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు కూడా రకుల్నే హీరోయిన్గా ఫైనల్ చేశారు. ఈ బ్యూటీ జోరు చూస్తుంటే త్వరలోనే పవర్ స్టార్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసేలాగే ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement