ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో | Mega Hero sai dharam tej intrest on flop directors | Sakshi
Sakshi News home page

ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో

May 20 2016 1:38 PM | Updated on Sep 2 2018 5:18 PM

ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో - Sakshi

ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న మెగా హీరో

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస హిట్స్తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్లో ఉన్న సాయి, ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లను ఆదుకునే పనిలో...

మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస హిట్స్తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్లో ఉన్న సాయి, ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లను ఆదుకునే పనిలో పడ్డాడు. తాజాగా సుప్రీమ్ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సాయి ధరమ్, ప్రజెంట్ తిక్క సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన భారీ డిజాస్టర్ ఓం3డి దర్శకుడు సునీల్ రెడ్డి, ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా తరువాత కూడా ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.

రామ్ హీరోగా తెరకెక్కిన పండగ చేస్కో సినిమాతో నిరాశపరిచిన గోపీచంద్ మలినేనితో సినిమా అంగీకరించాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తరువాత డైరెక్టర్గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రచయిత బివియస్ రవి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. తనకు పిల్లా నువ్వులేని జీవితం లాంటి సక్సెస్ఫుల్ స్టార్ట్ అందించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలోనూ సినిమా అంగీకరించాడు. అయితే రవికుమార్  చౌదరి కూడా సౌఖ్యం సినిమాతో భారీ డిజాస్టర్ను ఫేస్ చేశాడు. ఇలా వరుసగా ఫ్లాప్ దర్శకులతోనే సినిమాలు అంగీకరించి అందరికీ షాక్ ఇస్తున్నాడు సాయిధరమ్ తేజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement